Sunday, January 10, 2021

National Health Mission ద్వారా తెలంగాణ‌లోని ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం వివిధ విభాగాల్లో పోస్టుల భ‌ర్తీ (చివ‌రి తేది: 22.01.2021)

 

తెలంగాణ‌లోని ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం(సీహెచ్ఎఫ్‌డ‌బ్ల్యూ) వివిధ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 30
1) జిల్లా ప్రోగ్రాం ఆఫీస‌ర్‌ -  11
2) జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీస‌ర్‌ -11
3) జిల్లా అకౌంట్స్ మేనేజ‌ర్‌ - 08

అర్హ‌త‌: 
1) జిల్లా ప్రోగ్రాం ఆఫీస‌ర్: మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్ / డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ / ఎంఏ (సోషియాలజీ) / ఎంఎస్‌డ‌బ్ల్యూ / ఎంఎస్సీ (సోష‌ల్ సైన్స్‌) ఉత్త‌ర్ణ‌త‌.
ప‌ని అనుభ‌వం: ప్రజారోగ్య రంగంలో కనీసం 3 సంవత్సరాల సంబంధిత అనుభవం ఉండాలి.
వ‌య‌సు: 34 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.
జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.35000.
2) జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీస‌ర్‌: హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ / హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ / హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ / త‌త్స‌మాన అర్హ‌త ఉండాలి. 
ప‌ని అనుభ‌వం: హాస్పిటల్ మేనేజ్‌మెంట్ / హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
* NABH / ISO 9001: 2008 / సిక్స్ సిగ్మా / లీన్ వంటి గుర్తింపు పొందిన వ్యవస్థను అనుభవం ఉన్న‌వారికి ప్రాధాన్యత ఇస్తారు. 
* ఇంగ్లిష్‌, కంప్యూటర్ ప‌రిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.
వ‌య‌సు: 34 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.
జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.40000.
3) జిల్లా అకౌంట్స్ మేనేజ‌ర్‌: కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఎంబీఏ (ఫైనాన్స్) / ఎం.కామ్ ఉత్త‌ర్ణ‌త‌.
ప‌ని అనుభ‌వం: అకౌంట్స్ / ఫైనాన్స్ రంగంలో కనీసం 3 సంవత్సరాల సంబంధిత అనుభవం ఉండాలి.
వ‌య‌సు: 34 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.
జీత‌భ‌త్యాలు: నెల‌కు రూ.25000.
ఎంపిక విధానం: 
* అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్ట్ చేసి అనంత‌రం ఇంటర్వ్యూలో వ‌చ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 
* MD-NHM / CH & FW ఎంపిక ప్రక్రియను ఎప్పుడైనా, ఎలాగైనా మార్చే నిర్ణ‌యం/ రద్దు చేసే హక్కును కలిగి ఉంది. 
 * జిల్లా ప్రోగ్రాం ఆఫీస‌ర్‌, జిల్లా అకౌంట్స్ మేనేజ‌ర్ పోస్టుల‌కు మొత్తం 100 మార్కులు కేటాయిస్తారు. 
1) విద్యార్హ‌త‌లు: 50 మార్కులు వెయిటేజీ
2) ప‌ని అనుభవం: 25 మార్కులు వెయిటేజీ
3) ఇంట‌ర్వ్యూ: 25 మార్కులు వెయిటేజీ
* జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీస‌ర్ పోస్టుల‌కు మొత్తం 100 మార్కులు కేటాయిస్తారు. 
1) విద్యార్హ‌త‌లు: 25 మార్కులు వెయిటేజీ
2) ప‌ని అనుభవం: 50 మార్కులు వెయిటేజీ
3) ఇంట‌ర్వ్యూ: 25 మార్కులు వెయిటేజీ
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.500/-
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
1) అభ్యర్థి www.chfw.telangana.gov.in కు లాగిన్ అయి ఆన్‌లైన్ దరఖాస్తు నింపాలి.
2) ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి ముందు, అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజు ఫొటో, అకాడ‌మిక్ / టెక్నికల్ అర్హతలు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, వయసు ధ్రువీకరణ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇతర ధ్రువ‌ప‌త్రాల డిజిటల్ కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలి. 
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 22.01.2021.

apply:  https://tsnhm.cgg.gov.in/NHMFWWEB20/#!/home2210rspkas.rps 

Tuesday, January 5, 2021

PGRRCDE బీఈడీ కోర్సు బోధించేందుకు అకాడమిక్ అసోసియేట్ పోస్టులు (చివరితేదీ 16 జనవరి 2021)

 PGRRCDE (Distance Education Osmania University)  బీఈడీ కోర్సు బోధించేందుకు అకాడమిక్ అసోసియేట్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం 

పోస్టుల సంఖ్య: 07

అర్హత: సంబంధిత సబ్జెక్టుతో M.Ed లో  55 శాతం మార్కులతో పాసై ఎడ్యుకేషన్ విభాగంలో యూజీసీ నెట్ అర్హత సాధించావలెను   60 ఏళ్ళ లోపు వయసు ఉన్నవారు అర్హులు,

 చివరితేదీ 16 జనవరి 2021 ధ్రువపత్రాలతో పాటు  బయోడేటా ను పంపించాల్సిన మెయిల్ ఐడి 

email: directorpgrrcde@gmail.com

Monday, January 4, 2021

బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 54 టీచింగ్ పోస్టులు.. (చివరి తేది జనవరి 20, 2020)

 

 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 54
పోస్టుల వివరాలు:

  • పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ): 08
    సబ్జెక్టులు: హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీ, ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్
    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్(సీఎస్‌బీ) స్కోర్‌కార్డ్ ఉండాలి.
  • టెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ): 18
    సబ్జెక్టులు:ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్‌‌స, సోషల్ సైన్‌‌స, హెల్త్‌వెల్‌నెస్.
    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్(సీఎస్‌బీ) స్కోర్‌కార్డ్, కనీసం 60 శాతం మార్కులతో సీటెట్/టెట్ అర్హత కలిగి ఉండాలి.
  • పైమరీ టీ చర్లు(పీఆర్‌టీ): 26
    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్ (సీఎస్‌బీ) 60 శాతం మార్కులతో సీటెట్/టెట్ అర్హత ఉండాలి. మిగతా సబ్జెక్టులకు (పీఈటీ, స్పెషల్ ఎడ్యుకేటర్ తదితరాలు) సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత/సీబీఎస్‌ఈ, ఏడబ్ల్యూఈఎస్ నిబంధనల ప్రకారం ఉండాలి.

వయసు: ఏప్రిల్ 1, 2021 నాటికి ఫ్రెషర్స్ 40 ఏళ్లు మించకుండా ఉండాలి. అనుభవమున్న అభ్యర్థుల వయసు 57ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే తర్వాత నిర్వహించే ఇంటర్వ్యూకు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జెజె నగర్ పోస్ట్, సికింద్రాబాద్ 500087 అడ్రస్‌కు పంపించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 20, 2021.

http://www.apsbolarum.edu.in/ 

Saturday, January 2, 2021

ఇండియ‌న్ ఆర్మీ..షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ (NCC) అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు చివ‌రితేది: (28.01.2021)

 

ఇండియ‌న్ ఆర్మీ..షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఇందుకు గాను ఎన్‌సీసీ స్పెష‌ల్ ఎంట్రీ స్కీం 49వ కోర్సు(ఏప్రిల్ 2021) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అవివాహిత పురుషులు, మ‌హిళ‌లు వీటికి అర్హులు. 
వివ‌రాలు...
* షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్(ఎస్ఎస్‌సీ) ఆఫీస‌ర్లు
మొత్తం ఖాళీలు: 55
1) ఎన్‌సీసీ మెన్‌: 50 (జ‌న‌ర‌ల్ కేట‌గిరీ-45, యుద్ధ ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డ్డ ఆర్మీ సిబ్బందికి-05)
2) ఎన్‌సీసీ విమెన్‌: 05 (జ‌న‌ర‌ల్ కేట‌గిరీ-04, యుద్ధ ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డ్డ ఆర్మీ సిబ్బందికి-01)

అర్హత‌: క‌నీసం 50% మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చదువుతున్న వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దీనితో పాటు ఎన్‌సీసీ 'సీ' స‌ర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశించిన శారీర‌క ప్ర‌మాణాలు త‌ప్ప‌నిస‌రి. 
*
యుద్ధ ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డ్డ ఆర్మీ సిబ్బందికి క‌నీసం 50% మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. వీరికి ఎన్‌సీసీ ‌సీ స‌ర్టిఫికెట్ ఉండాల్సిన అవ‌స‌రం లేదు.

వ‌య‌సు: ఎన్‌సీసీ అభ్య‌ర్థుల‌కు (యుద్ధ ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డ్డ ఆర్మీ సిబ్బందిని క‌లుపుకొని) 01.01.2021 నాటికి 19-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. 02 జ‌న‌వ‌రి 1996 - 01.01.2002 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.
ఎంపిక‌: విద్యార్హ‌త‌లు, ఇత‌ర వివ‌రాల ఆధారంగా అభ‌ర్థుల‌ను మొద‌ట‌ షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారికి ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు. ఇది రెండు ఫేజ్‌లుగా ఉంటుంది. ఫేజ్‌-1, ఫేజ్‌-2 ప‌రీక్ష‌లు ఉంటాయి. ఫేజ్‌-1లో ఫెయిల్ అయిన అభ్య‌ర్థుల‌ను ఫేజ్‌-2కి ఎంపిక చేయ‌రు వారు అదే రోజు తిరిగివెళ్లొచ్చు. ఫేజ్‌-1లో ఎంపిక అయిన అభ్య‌ర్థుల‌కు ఫేజ్‌-2 ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ ఉంటుంది. ఇందులో ఎంపిక అయిన వారికి చివ‌ర‌గా మెడిక‌ల్ టెస్ట్ ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 30.12.2020.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 28.01.2021.

 నోటీఫికేషన్     https://joinindianarmy.nic.in/index.htm