తెలంగాణలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయం(సీహెచ్ఎఫ్‌డబ్ల్యూ) వివిధ
విభాగాల్లో ఔట్‌సోర్సింగ్
ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* మొత్తం ఖాళీలు: 30
1) జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ - 11
2) జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్ -11
3) జిల్లా అకౌంట్స్ మేనేజర్ -
08
అర్హత:
1) జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్: మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్ / డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ / ఎంఏ (సోషియాలజీ)
/ ఎంఎస్‌డబ్ల్యూ / ఎంఎస్సీ (సోషల్ సైన్స్) ఉత్తర్ణత.
పని అనుభవం: ప్రజారోగ్య రంగంలో కనీసం 3 సంవత్సరాల సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: 34 ఏళ్లకు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.35000.
2) జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్: హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ / హాస్పిటల్
అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ / హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ / తత్సమాన అర్హత ఉండాలి.
పని అనుభవం: హాస్పిటల్ మేనేజ్‌మెంట్ / హాస్పిటల్
అడ్మినిస్ట్రేషన్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
* NABH / ISO 9001: 2008 / సిక్స్ సిగ్మా / లీన్ వంటి గుర్తింపు
పొందిన వ్యవస్థను అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
* ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్
నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 34 ఏళ్లకు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.40000.
3) జిల్లా అకౌంట్స్ మేనేజర్: కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు గుర్తింపు
పొందిన విశ్వవిద్యాలయంలో ఎంబీఏ (ఫైనాన్స్) / ఎం.కామ్ ఉత్తర్ణత.
పని అనుభవం: అకౌంట్స్ / ఫైనాన్స్ రంగంలో కనీసం 3
సంవత్సరాల సంబంధిత అనుభవం ఉండాలి.
వయసు: 34 ఏళ్లకు మించకూడదు.
జీతభత్యాలు: నెలకు రూ.25000.
ఎంపిక విధానం:
* అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి అనంతరం
ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* MD-NHM / CH & FW ఎంపిక ప్రక్రియను ఎప్పుడైనా, ఎలాగైనా మార్చే నిర్ణయం/ రద్దు చేసే హక్కును
కలిగి ఉంది.
* జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్, జిల్లా అకౌంట్స్ మేనేజర్ పోస్టులకు మొత్తం 100 మార్కులు కేటాయిస్తారు.
1) విద్యార్హతలు: 50 మార్కులు వెయిటేజీ
2) పని అనుభవం: 25 మార్కులు వెయిటేజీ
3) ఇంటర్వ్యూ: 25 మార్కులు వెయిటేజీ
* జిల్లా క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్ పోస్టులకు
మొత్తం 100 మార్కులు కేటాయిస్తారు.
1) విద్యార్హతలు: 25 మార్కులు వెయిటేజీ
2) పని అనుభవం: 50 మార్కులు
వెయిటేజీ
3) ఇంటర్వ్యూ: 25 మార్కులు వెయిటేజీ
దరఖాస్తు ఫీజు: రూ.500/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
1) అభ్యర్థి www.chfw.telangana.gov.in
కు లాగిన్ అయి ఆన్‌లైన్ దరఖాస్తు నింపాలి.
2) ఆన్‌లైన్ దరఖాస్తును పూరించడానికి ముందు,
అభ్యర్థి పాస్‌పోర్ట్ సైజు ఫొటో, అకాడమిక్ / టెక్నికల్ అర్హతలు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, వయసు ధ్రువీకరణ సర్టిఫికేట్, బోనాఫైడ్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇతర ధ్రువపత్రాల డిజిటల్ కాపీలను
సిద్ధంగా ఉంచుకోవాలి.
* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 22.01.2021.
apply: https://tsnhm.cgg.gov.in/NHMFWWEB20/#!/home2210rspkas.rps