Monday, January 4, 2021

బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 54 టీచింగ్ పోస్టులు.. (చివరి తేది జనవరి 20, 2020)

 

 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి సికింద్రాబాద్‌లోని బొల్లారంలో ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 54
పోస్టుల వివరాలు:

  • పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ): 08
    సబ్జెక్టులు: హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, సైకాలజీ, ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్
    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్(సీఎస్‌బీ) స్కోర్‌కార్డ్ ఉండాలి.
  • టెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు(టీజీటీ): 18
    సబ్జెక్టులు:ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్‌‌స, సోషల్ సైన్‌‌స, హెల్త్‌వెల్‌నెస్.
    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్(సీఎస్‌బీ) స్కోర్‌కార్డ్, కనీసం 60 శాతం మార్కులతో సీటెట్/టెట్ అర్హత కలిగి ఉండాలి.
  • పైమరీ టీ చర్లు(పీఆర్‌టీ): 26
    అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ, ఏడబ్ల్యూఈఎస్ (సీఎస్‌బీ) 60 శాతం మార్కులతో సీటెట్/టెట్ అర్హత ఉండాలి. మిగతా సబ్జెక్టులకు (పీఈటీ, స్పెషల్ ఎడ్యుకేటర్ తదితరాలు) సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత/సీబీఎస్‌ఈ, ఏడబ్ల్యూఈఎస్ నిబంధనల ప్రకారం ఉండాలి.

వయసు: ఏప్రిల్ 1, 2021 నాటికి ఫ్రెషర్స్ 40 ఏళ్లు మించకుండా ఉండాలి. అనుభవమున్న అభ్యర్థుల వయసు 57ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే తర్వాత నిర్వహించే ఇంటర్వ్యూకు అర్హులు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జెజె నగర్ పోస్ట్, సికింద్రాబాద్ 500087 అడ్రస్‌కు పంపించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 20, 2021.

http://www.apsbolarum.edu.in/