భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: డాక్టర్ యర్నం చిన్నప్పయ్య పాల్వంచ ప్రభుత్వ
డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి వారి
ఆధ్వర్యంలో కళాశాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా
తీర్చిదిద్దడం జరిగింది.ప్రైవేట్ కళాశాల కు దీటుగా పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ
కళాశాల ను మార్చిన ఘనత ప్రిన్సిపల్ డాక్టర్ చిన్నప్పయ్య గారిది అని
చెప్పవచ్చు.ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఆన్లైన్ క్లాసులు
నిర్వహిస్తూ పిల్లల్లో చదువుపై ఆసక్తి కలగచేసే సెమినార్ క్లాసులు
నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు పూలబాటగా మార్చడానికి నిరంతరం కృషి
చేస్తున్న ప్రిన్సిపల్ డాక్టర్ యర్నం చిన్నప్పయ్య గారి సేవలకు పలువురి
ప్రశంసిస్తున్నారు .ఇటీవలే ప్రభుత్వ విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ గారి
చే అభినందనలు పొందారు.వీరి కృషి గుర్తించి ఇటీవలే జిల్లా కలెక్టర్ చేతుల
మీదగా బెస్ట్ ప్రిన్సిపల్ అవార్డు మరియు ప్రముఖ సినీనటి అమల చే State Best
outstanding principal award అందుకున్నారు.
గతం కంటే ప్రస్తుతం కళాశాలలో అడ్మిషన్స్ మరియు ఉత్తీర్ణత శాతం పెరిగిందని
చెప్పుకోవచ్చు.కళాశాలకు జాతీయస్థాయిలో NAAC గుర్తింపు పొంది I.S.O
certified లభించింది ,కళాశాలను నిత్యం పర్యవేక్షిస్తూ
N.S.S క్యాంపులు,విద్యార్థుల్లో దేశభక్తి ,స్కిల్ డెవలప్మెంట్ మోటివేషన్
తరగతులు నిర్వహిస్తున్న వీరి సేవలకు పాల్వంచ లోని పలు స్వచ్ఛంద సంస్థలు,
విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..
JH9 NEWS channel...