నేషనల్ లా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌యూ)లలో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో
నిర్వహించే పరీక్ష కామన్ లా అడ్మిషన్ టెస్ట్
(క్లాట్).
కోర్సులు:
యూజీ, పీజీ కోర్సులు.
అర్హతలు: అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత. గరిష్ట వయోపరిమితి లేదు.
పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ ఉత్తీర్ణత. గరిష్ట వయోపరిమితి
లేదు.
పరీక్ష విధానం
150 మార్కులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి
రెండుగంటలు.మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి
ప్రశ్నకు ఒకమార్కు.నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తారు.పరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్, జీకే, లీగల్ రీజనింగ్, లాజికల్
రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుంచి ప్రశ్నలు
ఇస్తారు.
వివరాలు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూలై 1, వెబ్‌సైట్:
https://consortiumofnlus.ac.in/clat-2020
source: Namaste Telangana Nipuna