Saturday, January 2, 2021

SSC కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవ‌ల్ ఎగ్జామినేష‌న్, 2020 (చివరితేది 31-01-2021)

 


స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిషన్ (ఎస్ఎస్‌సీ) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవ‌ల్ (సీజీఎల్‌) 2020 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.దీని ద్వారా వివిధ మంత్రిత్వ శాఖ‌లు/ విభాగాల్లో గ్రూప్‌బి, గ్రూప్‌సి పోస్టులను భర్తీ చేయనున్నారు.

వివ‌రాలు..

మొత్తం ఖాళీలు: 6506

1) గ్రూప్ బి గెజిటెడ్: 250

2) గ్రూప్ బి నాన్ గెజిటెడ్‌: 3513

3) గ్రూప్ సి: 2743

పోస్టులు: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ అకౌంట్స్‌ఆఫీస‌ర్‌, అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్, ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఇన్‌క‌మ్ టాక్స్, జూనియ‌ర్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్, ఆడిట‌ర్‌, అకౌంటెంట్‌, సీనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌, టాక్స్ అసిస్టెంట్‌, స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ ‌త‌దిత‌రాలు.

అర్హ‌త‌: గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ/ ఇన్‌స్టిట్యూట్ నుంచి బ‌్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుత‌న్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. అయితే 01.01.2021 నాటికి సంబంధిత అర్హ‌త పూర్తి చేసి ఉండాలి.

వ‌య‌సు: పోస్టును అనుస‌రించి ప‌్రక‌ట‌న‌లో సూచించిన విధంగా ఉండాలి.

ఎంపిక విధానం: దీనికి ఎంపిక ప్ర‌క్రియ 4 ద‌శ‌ల్లో ఉంటుంది. అవి..

1) టైర్‌-1: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌

2) టైర్‌-2: క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌

3) టైర్‌-3: పెన్ అండ్ పేప‌ర్ ప‌ద్ధ‌తిలో (డిస్క్రిప్టివ్ పేప‌ర్‌) 

4) టైర్‌-4: క‌ంప్యూట‌ర్ ప్రోఫిషియ‌న్సీ టెస్ట్‌/ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్‌ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

దర‌ఖాస్తు ఫీజు: ఇత‌రుల‌కు రూ.100, ఎస్సీ/ ఎస్టీ/ స‌్త్రీ/ పీడ‌బ్ల్యూడీ/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.

 

ముఖ్య‌మైన తేదీలు: 

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 29.12.2020 నుంచి 31.01.2021

ఆన్‌లైన్ పేమెంట్ చెల్లింపున‌కు చివ‌రితేది: 02.02.2021

ఆఫ్‌లైన్ పేమెంట్ (చ‌లాన్ ద్వారా) చెల్లింపున‌కు చివరితేది: 04.02.2021.

టైర్‌-1 ప‌రీక్ష ‌తేది: 29.05.2021 నుంచి 07.06.2021 వ‌ర‌కు.

టైర్‌-2 ‌ప‌రీక్ష ‌తేది (డిస్క్రిప్టివ్ పేప‌ర్‌): వెల్ల‌డించాల్సి ఉంది.

 నోటీఫికేషన్                         https://ssc.nic.in/